![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -290 లో..... ధీరజ్ కి తన ప్రేమ విషయం చెప్పాడానికి ప్రేమ తన దగ్గరికి వెళ్తుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఉన్న ఫొటోతో గల లాకెట్ ని ధీరజ్ కి ఇస్తుంది ప్రేమ. సరిగ్గా అది ఓపెన్ చేసేటప్పుడే అమూల్యని విశ్వ ఏడిపించడం ధీరజ్ చూస్తాడు. ఇక అక్కడికి వెళ్ళి విశ్వని ధీరజ్ కొడతాడు. విశ్వకి బ్లడ్ వస్తుంది. దాంతో ధీరజ్ పై కోప్పడుతుంది ప్రేమ.
ఇప్పుడు తెలిసింది.. నీ అసలు రూపం అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ప్రేమని ధీరజ్ అంటాడు. మరొకవైపు రామరాజు ఇంటికి కోపంగా వస్తాడు. అది చూసి మావయ్య గారు నర్మద, సాగర్ చేసిన పనికి మావయ్య కోపంగా ఉన్నాడని అనుకుంటుంది. శ్రీవల్లీ ఏదో మాట్లాడాలని వెళ్తుంది. కానీ రామరాజు మీ వాళ్ళని పిలిపించు మాట్లాడాలని శ్రీవల్లితో రామరాజు అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మరొకవైపు నువ్వు మా ఇంటికి ఎందుకు వెళ్ళావ్.. ఇప్పుడు అనవసరంగా మావయ్య బాధపడుతున్నారని సాగర్ తో నర్మద అంటుంది.
మరొకవైపు నా కొడుకుని కొట్టిన ఆ ధీరజ్ ని వదలనని సేనాపతి కోపంగా వెళ్తుంటే విశ్వ ఆపుతాడు. సేనాపతి వెళ్లకుండా ఆగిపోతాడు. అసలు నువ్వు ఎందుకు సేనాని ఆపావని విశ్వని భద్రవతి అడుగుతుంది. ఎప్పుడు గొడవ జరిగిన కూడా ప్రేమ నన్నే తిట్టేది కానీ ఇప్పుడు ధీరజ్ ని తిట్టింది. ఇంకా వాళ్ళ మధ్య దూరం పెంచాలి.. ఆ అమూల్యకి దగ్గర కావాలని భద్రవతికి విశ్వ చెప్తాడు. తరువాయి భాగంలో ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి సారీ చెప్తాడు. ధీరజ్ చెయ్ కి బ్లడ్ వస్తుంటే ప్రేమ కట్టుకడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |